
కామేపల్లి వారి పుట్టినరోజు వేడుకల్లో తెదేపా ప్రజాప్రతినిధులు
ప్రకాశం న్యూస్, దొనకొండ: ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని రామాపురం గ్రామంలో ఆదివారం రాత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు కామేపల్లి పోలయ్య కుమారుడు జైదీప్ పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్‌రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బీఎన్ విజయ్‌కుమార్, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, దర్శి తెదేపా ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, తెదేపా నాయకులు కడియాల లలిత్ సాగర్, దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, తెదేపా నాయకులు కడియాల రమేష్, రామాపురం మాజీ సర్పంచ్ కామేపల్లి చెంచయ్య నారాయణమ్మ చౌదరి తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, తెదేపా నేతలు కేక్ కట్ చేసి జైదీప్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను కామేపల్లి చెంచయ్య, పోలయ్య శాలువా, పూల మాలలతో సత్కరించారు.





