
పార్వతమ్మ మరణం బాధాకరం: మార్కాపురం వైకాపా నేత ఉడుముల కోటిరెడ్డి
ప్రకాశం న్యూస్, మార్కాపురం: ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యురాలు, దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ అనారోగ్య కారణంగా మరణించడం బాధాకరమని మార్కాపురం నియోజకవర్గ వైకాపా సీనియర్ నాయకులు ఉడుముల కోటిరెడ్డి అన్నారు. కావలి ఎమ్మెల్యేగా, ఒంగోలు పార్లమెంట్ సభ్యురాలిగా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేసి పార్వతమ్మ ప్రజల మనసును గెలుచుకుందన్నారు. పార్వతమ్మ మృతికి సంతాపం తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మాగుంట కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఉడుముల కోటిరెడ్డి తెలియజేశారు.
