
జనసేనలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవిశంకర్
ప్రకాశం న్యూస్, ఒంగోలు: ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఒంగోలులోని రవి ప్రయా మాల్ అధినేత కంది రవిశంకర్ గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అంతకుముందు ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈయన 35 ఏళ్ల కిందట యువజన కాంగ్రెస్‌లో పనిచేశారు. అనంతరం తన వ్యాపారాలపై దృష్టి సారించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పర్చూరు నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ, అది కేవలం ప్రచారంగానే ముగిసింది. ఇటీవల రవిశంకర్ వియ్యంకుడు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైకాపాకు రాజీనామా చేశారు. దీంతో గురువారం రోశయ్యతో కలిసి రవిశంకర్ జనసేన పార్టీలో చేరారు.