
డీసీసీ ప్రెసిడెంట్ సైదా ప్రమాణస్వీకారానికి తరలిరండి: కైపు వెంకట కృష్ణారెడ్డి
ప్రకాశం న్యూస్, దర్శి: ఈనెల 19న ఉదయం 10 గంటలకు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆశీస్సులతో షేక్ సైదా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కైపు వెంకటకృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ పీసీసీ అధ్యక్షులు నీలకంఠాపురం రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, మాజీ రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ మస్తాన్‌వలి, మాజీ శాసనసభ్యులు, బాపట్ల డీసీసీ అధ్యక్షులు ఆమంచి కృష్ణమోహన్, ఏపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, నంద్యాల డీసీసీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్, ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్‌రెడ్డి, ఒంగోలు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తుర్కపల్లి నాగలక్ష్మి, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొంటారని కైపు వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలు నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. అనంతరం ఆయన కార్యక్రమం వివరాలను తెలిపారు.
కార్యక్రమం వివరాలు.. ఈనెల 19వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ఒంగోలు లాయర్‌పేటలోని సాయిబాబా గుడి వద్దనున్న టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద నుంచి ర్యాలీ, ఉదయం 11 గంటలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారోత్సవ సభ జరగనున్నట్లు కైపు వెంకట కృష్ణారెడ్డి వివరించారు.